TSAR - Teacher's self assessment Rubrics: డేటా నమోదు చేయండి
TSAR
TEACHERS SELF ASSESSMENT RUBRICS
ఉపాధ్యాయుల స్వీయ మదింపు
లింకును టాప్ చేయండి TSAR ఓపెన్ అవుతుంది.
Register without OTP టాప్ చేయండి.
👉 User రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
ఫస్ట్ మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఎంప్లాయ్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి.
మీకు ఇష్టమైనటువంటి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
పాస్వర్డ్ లో ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ మరియు ఒక న్యూమరిక్ తప్పనిసరిగా ఉండాలి. కనీసం ఎనిమిది అక్షరాలతో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి.
Ex: Vivek@1234, Password*3456
👉 రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు మెయిల్ ఐడి మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది.
👉 లాగిన్ చేయగానే TSAR యొక్క హోం పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఒక్కో సెక్షన్ లో డేటా నమోదు చేస్తూ వెళ్ళాలి.
👉 మొదటిది profile సెక్షన్.
ఈ సెక్షన్లో ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఇచ్చిన ట్రెజరీ id ద్వారా డేటా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. కనిపిస్తున్న వివరాలను చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పులు ఉన్నట్లయితే edit సెలెక్ట్ చేసి సవరణలు చేసుకోవాలి.అన్ని సరిగా ఉంటే ఏ మార్పులు చేయనవసరం లేదు.
ఉపాధ్యాయుని పేరు, పుట్టిన తేదీ, కులము, ట్రెజరీ id, మండలం,జిల్లా, పాఠశాల పేరు మండలం జిల్లా మొదలైన వివరాలు కనిపిస్తాయి.
👉 Academic qualifications
ఈ సెక్షన్ లో ఉపాధ్యాయులు తమ యొక్క అకడమిక్ క్వాలిఫికేషన్ వివరాలు fill చేయవలసి ఉంటుంది. ఉద్యోగం లో జాయిన్ అయ్యే నాటికి పూర్తి చేసిన క్వాలిఫికేషన్ నుండి హైయెస్ట్ క్వాలిఫికేషన్, పాస్ అయినటువంటి యూనివర్సిటీ పేరు,year మరియు చదివి సబ్జెక్టుకు సంబంధించిన వివరాల డేటా ను సేవ్ చేయాలి.
ఈ విధంగా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని సేవ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు M.SC పూర్తి చేసి, ఆ తర్వాత MA కూడా పూర్తి చేసినట్లయితే రెండు క్వాలిఫికేషన్స్ సేవ్ చేసుకోవచ్చు.
First ఒక క్వాలిఫికేషన్ వివరాలు సేవ్ చేయాలి.తరువాత add new క్లిక్ చేసి మరొక క్వాలిఫికేషన్ సేవ్ చేయాలి.
ఉపాధ్యాయులు పదో తరగతి నుండి ప్రారంభించి, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పి హెచ్ డి, ఎం ఫిల్ అన్నీ అకడమిక్ క్వాలిఫికేషన్ లను కూడా సేవ్ చేసుకోవచ్చు.
👉 Professional qualifications
ఈ సెక్షన్లో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన వివరాలను నింపాలి. ఉపాధ్యాయుడు పూర్తిచేసిన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాల డేటాను సేవ్ చేసుకోవాలి.
B.Ed తో M.Ed క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులు రెండింటి డేటా ను సేవ్ చేయవచ్చు.
TTC, తెలుగు పండిట్, విశారద, ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదలైన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లను సేవ్ చేసుకోవచ్చు.
👉 Experience
ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు తమ యొక్క,experience వివరాలను నింపాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ నుండి ఇప్పటివరకు ఉన్నటువంటి అనుభవం( experience) పూర్తయిన సంవత్సరాలు మరియు నెలల లో డేటాను,
ఏ కేటగిరీ పోస్టులో( SGT, SA,GHM,LFLHM) ఎన్ని సంవత్సరాలు పూర్తి చేశారో ఆ వివరాలు సేవ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో కేటగిరీ వారీగా వివరాలు నింపాలి.
ఉదా: మొదట SGT గా నియామకం అయితే ఆ వివరాలు ఇవ్వండి. నియామకం నుండి sgt గా పనిచేసిన పీరియడ్ వరకు వివరాలు ఇవ్వాలి.
తరువాత SA ప్రమోషన్ తీసుకుంటే ఆ వివరాలు,
తరువాత GHM ప్రమోషన్ తీసుకుంటే ఆ సర్వీస్ వివరాలు ఇవ్వాలి.
నియామకం నుండి ఇప్పటివరకు ఒకే కేడర్లో పని చేసినట్లైతే కేవలం ఆ వివరాలు మాత్రమే ఇస్తే సరిపోతుంది.
ఈ సెక్షన్లో SGT,SA అనే వివరాలు కనిపించవు. కాబట్టి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా OTHER సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీ యొక్క కేటగిరి పోస్టుల వివరాలు ఇవ్వండి.
👉 In service
తర్వాత సెక్షన్ లో ఉపాధ్యాయులు గత మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన శిక్షణలకు సంబంధించిన వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఏ రకమైనటువంటి శిక్షణను ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని రోజులు తీసుకున్నారు. శిక్షణ యొక్క స్థాయి( మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ), ఉద్దేశ్యాలు, లక్ష్యాల విరాలను సేవ్ చేయవలసి ఉంటుంది.
గత మూడు సంవత్సరాలలో ఉపాధ్యాయులకు, నిష్ఠ ట్రైనింగ్ ఇంగ్లీష్ బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ పై శిక్షణ, సైన్స్ ఉపాధ్యాయులకు ఇన్నోవేషన్ యాక్టివిటీస్ పై శిక్షణ, 3Rs - రీడింగ్, రైటింగ్, అర్థమేటిక్ శిక్షణలు జరిగినాయి.
ఆన్లైన్లో లీడర్ షిప్, సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ,
హెల్త్ అండ్ వెల్ బీయింగ్ శిక్షణలు జరిగినాయి.
👉 Classes taught
ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు బోధిస్తున్నటువంటి తరగతులు, సబ్జెక్టులకు సంబంధించినటువంటి వివరాలను fill చేయాలి. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అన్ని తరగతులు ( 1-5th) మరియు అన్ని సబ్జెక్టులను ( తెలుగు, ఇంగ్లీష్, గణితం,ప.వి) ఎంపిక చేసుకోవాలి. హై స్కూల్ ఉపాధ్యాయులు వారి బోధిస్తున్న అటువంటి తరగతి మరియు సబ్జెక్టులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. GHM లు ఏదైనా సబ్జెక్టును బోధించినట్లు అయితే వారు కూడా ఆయా వివరాలను సేవ్ చేసుకోవచ్చు. ఉపాధ్యాయుల యొక్క అదనపు బాధ్యతలు,( ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్నభోజనం, పరీక్షల నిర్వహణ, బాలల సంఘాలను కోఆర్డినేట్ చేయడం, లైబ్రరీ పుస్తకాల నిర్వహణ, హరితహారం మొదలైనవి అదనపు బాధ్యతలు) వివరాలు నమోదు చేయాలి.
ఉపాధ్యాయులు తీసుకున్నటువంటి అవార్డులకు సంబంధించిన వివరాలను(మండల, జిల్లా, జాతీయ స్థాయి, అవార్డుల వివరాలు) సేవ్ చేయవలసి ఉంటుంది.
👉 Teachers performance
ఈ సెక్షన్లో ఉపాధ్యాయులు సెల్ఫ్ అసెస్మెంట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 40 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుడు గుర్తించిన సమాధానాల ఆధారంగా రేటింగ్ ఇవ్వబడుతుంది. ఉపాధ్యాయులు తమ యొక్క సొంత ప్రతిస్పందనలు మాత్రమే నమోదు చేయాలి.
ఇక్కడ ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఉంటాయి అన్ని సమాధానాలు సరైనవి ఉంటాయి మీరు ఎంపిక చేసుకున్న సమాధానాన్ని బట్టి మీకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ ప్రశ్న రూపంలో ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ ను ( activity ) మనము ఏ రకంగా నిర్వహిస్తున్నామనేది జవాబు గా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది.
👉 Descriptive feedback
ఈ సెక్షన్లో మొత్తం 9 performance standards ఉంటాయి. ఉపాధ్యాయుడు ఒక్కో అంశాన్ని ఎంపిక చేసుకుంటూ ఆయా standards లో వారి బలాలు, బలహీనతలు, వాటిని అధిగమించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి అభివృద్ధి ప్రణాళిక వివరాలను fill చేసి డేటాను సేవ్ చేయాలి.
👉 అన్ని అంశాలలో వివరాలను నమోదు చేసిన తర్వాత వెంటనే ఫైనల్ సబ్మిట్ చేయవద్దు. మీరు నమోదు చేసిన వివరాలను ఒకటి లేదా రెండు సార్లు సరిచూసుకోండి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయండి. ఫైనల్ సబ్మిట్ చేయడానికి ముందు డేటాను ఎన్నిసార్లైనా ఎడిట్ చేసి మార్చడానికి అవకాశం ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత మార్చడానికి వీలు కాదు.
ఉపాధ్యాయుల యొక్క ఈ మదింపు ప్రతి విద్యా సంవత్సరం చేయవలసి ఉంటుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మనం మొదటిసారిగా చేస్తున్నాము. ఇక నుండి ప్రతి విద్యాసంవత్సరం ఉపాధ్యాయుల స్వీయ మదింపు చేయవలసి ఉంటుంది.
Tsar యాప్ లోకి వెళ్ళడానికి ఇక్కడ CLICK చేయండి
TSAR మాడ్యుల్ కొరకు ఇక్కడ CLICK చేయండి.
మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లు అయితే లాగిన్ పేజీలో ఫర్గాట్ పాస్వర్డ్ సెలెక్ట్ చేయండి. మీయొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేసినట్లయితే మీ మెయిల్ కి పాస్వర్డ్ send యడం జరుగుతుంది.
TSAR లో ఉపాధ్యాయులు సొంత ఇమెయిల్తో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రధానోపాధ్యాయులు TSAR లో తమ పాఠశాలను రిజిస్టర్ చేయవలసి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు పాఠశాలను రిజిస్టర్ చేయడం వల్ల వారి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క డేటా వివరాలను తెలుసుకోవచ్చు.
మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్టన్ లో కామెంట్ రాయండి.
All the best.....in school activities.
Comments
Post a Comment