RTI Act

సమాచార హక్కు గురించి  మీకు పూర్తిగా తెలుసా.?

సమాచారం ఇవ్వకపోతే  ఆ ప్రజా సమాచార అధికారి గారు  *IPC సెక్షన్స్ 166,167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నెరపరిదిలోకి వస్తారు* , కాబట్టి స.హ చట్టం కింద  దరఖాస్తు దారులు  కోరిన  సమాచారాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి  లేని పక్షములో సమాచార నిబంధనలు ఉల్లంఘించి నందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం  కేంద్ర,రాష్ట్ర కమీసనర్లు కూడా  సమాచారం ఇవ్వని వారిని  జైలుకు పంపవచ్చు చట్టంలో పేర్కొనబడింది.

 ఒకవేళ పూర్తి అవగాహనా లేకపోతె క్రింది వివరాలు చూడండి.
👇👇👇👇👇
""సమాచార  హక్కు ప్రతి దరకాస్తుదారుడు ... వినియోగదారే""
*30రోజుల్లో* సమాచారం *ఇవ్వకుంటే* వినియోగదారుల *ఫోరమ్ వెళ్ళవచ్చు.*

సమాచారాన్ని దరఖాస్తు ఫారం లేదు కావలసిన సమాచారం  తెల్లకాగితంపై రాసి ipo(ప్రజా సమాచార అధికారికి) అడగవచ్చు    అధికారికి డైరెక్టు గా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా అయిన పంపి అడగవచ్చు .
"దరఖాస్తు దారునికి వయసు స్థానికత అవసరం లేదు"

సెక్షన్ 2 (f) ప్రకారం సమాచారం నిర్వచనం.(కార్యాలయాల్లో రికార్డులు, పత్రాలు, మెమోలు,ఈ మైయిల్స్, అభిప్రాయాలు, పుస్తకాలు, ప్రకటనలు, సీడీలు,డివిడిలు,  మొదలైనవి).

సెక్షన్ 2 (h) ప్రకారం సమాచార చట్ట పరిధిలోకి వచ్చే కార్యలయలు  (ప్రభుత్వంచే గుర్తింపుబడిన, స్వచ్చంద సంస్థలు)

సెక్షన్2(i) ప్రకారం రికార్డు నిర్వచనం

సెక్షన్ 2(j) ప్రకారం ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు పరిశీలించవచ్చు,
ఏ ప్రభుత్వపు కార్యాలయంలో రికార్డులనైనా దరఖాస్తు చేసుకొని తనిఖీ చేయవచ్చు అవసరం అయితే జిరాక్స్ చేసుకోవచ్చు.

సెక్షన్2(j)(1)  ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు(ఒక గంటకు రూ5/-)
సెక్షన్ 3 ప్రకారం పౌరులందరికి సమాచారం ఇవ్వాలి.
(దరఖాస్తు చేసుకోవడానికి మీ పరిధి కాదు అని ప్రశ్నించడానికి వీలు లేదు)
సెక్షన్4(1)(a) ప్రకారం ప్రతి శాఖ వారు రికార్డు నిర్వహణ
సెక్షన్ 4(b) ప్రకారం స్వచ్చంగాముగా వెల్లడించవలసిన సమాచారం ఎవరు ఆడగక ముందే ఆ  సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.

సెక్షన్ 4(1)(c),(d) ప్రకారం  నిర్ణయాలు  వాటికీ కారణాలు చెప్పకరలేదు(సమాచారం ఎందుకు అని చెప్పక్కరలేదు)
సెక్షన్4(2) ప్రకారం వీలయినంత ఎక్కువుగా స్వచ్చందంగా ఇవ్వవలసిన సమాచారం
సెక్షన్4(4) ప్రకారం స్థానిక భాషలో ఇవ్వాలి

సెక్షన్5(1),(2) ప్రకారం ప్రజాసమాచార అధికారులు(ipo ) అప్పిలేట్ అధికారుల నియామకం

సెక్షన్-6(1) ప్రకారం
సమాచార హక్కు దాఖలు విధానం

సెక్షన్6(2)ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు

సెక్షన్ -6(3)  ప్రకారం కోరిన సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ( సమాచారం మరో కార్యాలయానికి పంపావలసిన బాద్యత అధికారులదే).

సెక్షన్-7(1)ప్రకారం 30రోజుల లోపు సమాచారం ఇవ్వవలసిందే... *వ్యక్తి జీవితానికీ  స్వేచ్ఛ సంభందించినది ఐతే 48 గంటల లోపే ఇవ్వాలి.*

సెక్షన్7(3)(a) ప్రకారం సమాచార రుసుము
 (కోర్టు సంబంచిన మాత్రం రూ25/- మిగతా శాఖ వారికి రూ10/-మాత్రమే చెల్లించాలి.
ఏ రూపంలో చెలించాలంటే
(1) నగదు రూపంలో,
(2) ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు,
(3) డిమాండ్ డ్రాఫ్టు,
(4) కోర్టు ఫీ స్టాంపు వేయాలి,
(5)బ్యాంకర్స్ చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రుసుం. ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి.
 విలయినంతగా పోస్టల్ ఆడారు మాత్రమే రుసుముగా చెల్లించాలి.

(ప్రతి పేజీకి ఏ-4 ఏ-4 రూ 2/- చెప్పున, సీడికి రూ100/- చెప్పున,ప్లాపికి రూ50/- చెప్పున, డీవీడీ కి200 చెలించాలి 
కోర్టు లో ప్రతి పేజీకి రూ 5/- చెప్పున చెల్లించాలి.

సెక్షన్ 7(1) ప్రకారం దరఖాస్తు గడువు30 రోజులు
సెక్షన్7(6) ప్రకారం గడువులోపు సమాచారం ఇవ్వకుంటే  సమాచారం ఉచితముగా ఇవ్వాలి.

సెక్షన్8(1) ప్రకారం సమాచారం మినహహింపులు  (డాక్టర్ పెసెంట్ ఇంజెక్షన్ ద్వారా ఇచ్చిన మందులు  మనిషికి ఉన్న వ్యాధులు,దేశరక్ష  సంబంచించిన ఒప్పందాలు)
సెక్షన్8(2)ప్రకారం అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం  ఉంటే   మినహాయింపులు వర్తించవు.

సెక్షన్18(1)ప్రకారం కమీషన్లకు పిర్యాదు
 సెక్షన్19(1)ప్రకారం మొదటి అప్పీలు 
సెక్షన్19(3)రెండవ అప్పీలు
90 రోజుల లోగా రాష్ట్ర కేంద్ర సమాచార కమీషన్ అప్పీల్ చేసుకోవాలి.సరైన కారణాలు ఉంటే 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు.

సెక్షన్19(1)కమీసన్ల  నిర్ణయాలు
సెక్షన్-19(8)(b) ప్రకారం ధరాఖస్తుదారు తనకు  కలిగిన ఆర్థికపరమైన కష్టనష్టలపై కమిషన్ ఆధారాలు సమర్పించాలి సక్రమంగా ఉంటే  నష్టపరిహారం మంజూరు చేయాలి.

సెక్షన్20(1)సమాచారం ఇవ్వకపోతే  (తప్పుడు సమాచారం ఇస్తే రోజుకు రూ 250 చప్పున  వరకు రూ25,000 జరిమానా
సెక్షన్20(2)క్రమక్షణ చర్యలకు సిపారసు
గడువులోగా సమాచారం ఇవ్వకపోతే  వినియోగదారుల పొరనికి వెళ్ళవచ్చు

ఐపీవో తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిసనర్ లేకుంటే  డైరెక్టుగా  న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.

రెండవషెడ్యూల్ లోని నిఘా భద్రతా సంస్థల్లో  సెక్షన్ 24(1) అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబందించిన సమాచారాన్ని మాత్రం తీసుకోవచ్చు.
ఇంటెలిజెన్స్ బ్యూరో, రా సీఆర్పీఎఫ్, బిఎస్ ఎఫ్,  ఎన్ ఎస్ జీ ఎస్ ఎస్ బి  కి వర్తిస్తాయి.

Comments

Popular posts from this blog

APAAR: సందేహాలు - సమాధానాలు

SSC PUBLIC EXAMINATIONS -INDIA Map pointing in social studies

APAAR GENERATE, GP, EP, FP, UPDATE AND HOW TO CHANGE STUDENT DETAILS